NTR ‘డ్రాగన్’ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ !
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’ గురించి మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమా సంగీతం విషయంలో మేకర్స్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనున్నారట. రవి బస్రూర్ BGM ఇరగదీస్తున్నప్పటికీ పాటల విషయంలో అంతగా ఆకట్టుకోలేక పోతున్నాడని బయట వినిపిస్తున్న టాక్ .
మరోవైపు ‘ధురంధర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్‌ను కొన్ని పాటల కంపోజిషన్ కోసం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇలా ఇద్దరు సంగీత దర్శకుల ప్రతిభను ఒకే ప్రాజెక్ట్ కోసం ఉపయోగించుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రవి బస్రూర్ మాస్ ఎలివేషన్స్‌కు, శాశ్వత్ సచ్‌దేవ్ పాటలకు పనిచేస్తే ‘డ్రాగన్’ మ్యూజిక్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయం.
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మ్యూజిక్ కాంబినేషన్‌పై తారక్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
